Header Banner

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! అక్కడ మరో భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్!

  Thu Apr 10, 2025 11:01        Politics

నక్కపల్లి ఏపీఐఐసీ సెజ్‌లో అర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం లక్షా 35 వేల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో 17.8 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. మొదటి దశలో రూ.55,964 కోట్ల పెట్టుబడితో ఏటా 7.3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించి, 2029 జనవరినాటికి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఈ దశలో 20 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రెండో దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో 10.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను 2033 నాటికి ప్రారంభిస్తారు, దీని ద్వారా మరో 35 వేల ఉద్యోగాలు కల్పించబడతాయి.

 

ఇతర మౌలిక సదుపాయాల్లో భాగంగా, డీఎల్‌పురంలో 2.9 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్‌తో కూడిన క్యాప్టివ్ పోర్ట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిట్టల్ స్టీల్ ఇండియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు ఈ పోర్ట్ నిర్మాణం కోసం కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌తో ఉన్న రాయితీ ఒప్పందాన్ని సవరించారు. రూ.5,816 కోట్ల అంచనా వ్యయంతో, ఏటా 20.5 మిలియన్‌ టన్నుల హ్యాండ్లింగ్‌ సామర్థ్యం గల ఈ పోర్ట్ 2029 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రారంభ దశలో వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి, అలాగే రెండో దశలో దీన్ని మరింత విస్తరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కావడంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా అధికారులు సహకరించాలని ఆదేశించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #SteelPlant #ArcelorMittal #IndustrialGrowth #MegaInvestment #MakeInIndia #InfrastructureDevelopment #ManufacturingIndia